Header Banner

భారత్‌తో పెట్టుకుంటే బాక్స్ బద్దలే.. ఈ దెబ్బతో పాకిస్తాన్‌కి అన్నీ దార్లు మూసుకుపోయినట్లే!

  Tue Apr 29, 2025 14:49        Politics

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాయాది దేశంపై భార‌త్ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. దీంతో ఇండియాపై పాక్ ఆంక్ష‌ల‌కు దిగింది. ఈ క్ర‌మంలో త‌మ గ‌గ‌న‌త‌లంపై మ‌న దేశ విమానాల రాక‌పోక‌ల‌ను బ్యాన్ చేసింది. ఈ నేప‌థ్యంలో కేంద్రం కూడా ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. పాక్ ఎయిర్‌లైన్ల‌కు మ‌న గ‌గ‌న‌తలాన్ని మూసివేసే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ప‌లు జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ ప్ర‌తిపాద‌న ప‌రిశీల‌న ద‌శ‌లో ఉంది. ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు అని కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ఓ అధికారి వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ భార‌త ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటే... అది పాక్ ఎయిర్‌లైన్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..! వారికి సేవల పొడిగింపు వర్తింపు.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ!

 

పాకిస్థాన్ ఫ్లైట్స్ సింగ‌పూర్, థాయ్‌లాండ్‌, మ‌లేసియా త‌దిత‌ర దేశాల‌కు వెళ్లాలంటే మ‌న గ‌గ‌నత‌లాన్ని దాటాల్సిందే. ఇప్పుడు ఇండియా బ్యాన్ చేస్తే... ద‌క్షిణాసియా ప్రాంతాల‌కు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల‌ను మ‌ళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్ర‌యాణ స‌మ‌యంలో పెర‌గ‌డంతో పాటు నిర్వ‌హ‌ణ వ్య‌యం కూడా తడిసి మొపెడవుతోంది. ఇప్ప‌టికే ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాక్ విమానయాన సంస్థ‌ల‌కు ఇది మ‌రింత భారంగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌, భారత విమానాల‌పై త‌మ గ‌గ‌న‌త‌లంలో ప్ర‌వేశించ‌కుండా నిషేధం విధించిన పాక్ ఇప్ప‌టికే భారీగా న‌ష్ట‌పోతున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌న‌కంటే కూడా దాయాది దేశానికే ఎక్కువ ఆర్థిక న‌ష్ట‌మ‌ని నిపుణులు అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ నుంచి పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా వారానికి 800కి పైగా అంత‌ర్జాతీయ విమానాలు రాక‌పోక‌లు కొన‌సాగించేవి. ఇందుకోసం ఓవ‌ర్‌ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు 1ల‌క్ష 20వేల డాల‌ర్లు వ‌సూలు చేసేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పాక్ న‌ష్ట‌పోవాల్సిందే. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations